మనిషిని చూసి.. బొమ్మగా మలిచి!


Mon,December 9, 2019 12:52 AM

china-artist
సాధారణంగా మనిషిని చూసి అప్పటికప్పుడు చిత్రాలు వేసేవాళ్లుంటారు. మనసులో అనుకున్న భావానికి రూపం ఇచ్చే వారూ ఉంటారు. కానీ మనిషిని చూసిన వెంటనే అదే ఆకృతిలో అతి చిన్న బొమ్మను తయారు చేయడం మాత్రం కొందరికే సాధ్యం. ఈ ప్రతిభతోనే రాణిస్తున్నాడు చైనాకు చెందిన ఓ ఆర్టిస్ట్‌.
china-artist1
పండ అనే యువకుడిది చైనా. ఆయన ఓ చిత్రకారుడు. పాలిమర్‌ క్లేతో అదిరిపోయే బొమ్మలు వేస్తుంటాడు. అతడు తయారు చేసే బొమ్మల్ని చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. అందుకు సంబంధించి అతను ప్రతీ బొమ్మ తయారీ వీడియోను తన వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాడు. పాలిమర్‌ మట్టి ముద్ద తీసుకొని దానికి కళ్లు, చెవులు, ముక్కు, నోరు ఇలా అన్ని ఆకారాలు వచ్చేలా చేస్తున్నాడు. రంగులద్ది అచ్చం మనిషిలాగే బొమ్మ తయారు చేస్తున్నాడు. ఆ దేశంలో ఇతను తయారు చేసే బొమ్మలకు భలే గిరాకీ లభిస్తున్నది. ఆన్‌లైన్‌ ద్వారా తాను తయారు చేసిన కళాకృతుల్ని అమ్ముతున్నాడు. తమ బొమ్మలు తయారు చేసి పంపాలని ఎంతోమంది సోషల్‌ మీడియాలో లోడ్‌ చేస్తున్నారు. పండ ఒక బొమ్మ తయారు చేయడానికి 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటున్నాడు. 20 గ్రాముల క్లే నుంచి మొదలుకొని కేజీ వరకు పాలిమర్‌ క్లేతో కూడా బొమ్మలు తయారు చేయగల నేర్పు ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన బొమ్మలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
china-artist2

425
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles