ఇంటికో శునకం ఉండాలి


Mon,December 9, 2019 12:47 AM

dogs
ఈ రోజుల్లో పరిస్థితుల్ని బట్టి మహిళలు భద్రత వహించాలి. బయట జరిగే అనర్థాలను ఎదుర్కోలేకపోయినా ఇంటి వద్దనైనా క్షేమంగా ఉంటారని నమ్మకం లేదు. తమ రక్షణకోసం ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నదో మహిళ. దత్తత తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతున్నది.


మద్యతరగతి వారైనా, డబ్బున్నవారైనా ఇంట్లో శునకాన్ని పెంచుకోవడం ఫేషన్‌గా మారింది. బయటకు ఎక్కడికెళ్లినా పెంపుడు కుక్కలను వెంటతీసుకెళ్లడంతో వారికి రక్షణ కల్పిస్తున్నాయి. అందుకే వాటిని పెంచుకునేందుకు యజమానులు ఉత్సాహం చూపుతున్నారు. కొత్తగా శునకాలను దత్తత తీసుకునేవారికి బెంగళూరుకు చెందిన సంధ్యా మడప్ప కొన్ని జాగ్రత్తలు చెబుతున్నది. వాటిని అనుసరించి సునకాన్ని దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నది.

దత్తత తీసుకోనేముందు జాగ్రత్తలు

- శునకాన్ని దత్తత తీసుకునేముందు ఎలాంటి కుక్క కావాలో నిర్ణయించుకోవాలి. వాటి ఆహార విషయాలు, ఇంటిముందు ప్రదేశం, ఇంటి సభ్యులు చూసుకోగలరో లేదో అన్నీ ఆలోచించుకోవాలి.
- ఇంట్లో వృద్దులు ఉంటే శిక్షణ కలిగి ఉన్నవి అయితే మంచిది. అప్పుడప్పుడు డాగ్‌షెల్టర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పించుకోవాలి. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, చెన్నైలాంటి నగరాల్లో షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
- దత్తత తీసుకునేముందు వాటి అలవాట్లను గమనించాలి. ఇష్టమైనవి తెలుసుకోవాలి. వాటికి నచ్చిన విధంగా అనుసరిస్తే వాటితో బంధం ఏర్పడుతుంది.
- శునకానికి టీకాలు వేశారో లేదో నిర్థారించుకోండి. వైద్య రికార్డులు, గత అనారోగ్యాలు, గాయాలు ఉంటే చికిత్స అందించమని అడగండి.
- కుక్కను ఎలా చూసుకుంటారు. ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నలు అడుగుతారు. శునకానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా దాచుకోవాలి.
- కౌన్సెలింగ్‌ తర్వాత కుక్కను మీకు అప్పగిస్తుంది. అయినప్పటికీ ఇంటి వాతావరణానికి అలవాటు పడడానికి కుక్కకు కొంత సమయం పడుతుంది. సహనంతో ఉండాలి. కన్నబిడ్డను చూసుకున్నట్లు శునకాన్ని చూసుకుంటే మీకు రక్షణగా ఉంటుందని అంటున్నది సంధ్యా.

632
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles