ఆదిగురువు ఆరాధన


Sun,December 8, 2019 01:08 AM

Ila-cheddam
ఒక పనితో అనేక ప్రయోజనాలు పొందడం చాలా అరుదు. ఆధ్యాత్మిక పరంగా, భక్తిమార్గంలో ఇది కొందరికి ఒక్కోసారి సాధ్యమవుతుంది. సృష్టి, స్థితి, లయకారులైన త్రిమూర్తుల స్వరూపం దత్రాతేయుడు. ఏటా వచ్చే ‘దత్త జయంతి’ ఈ స్వామి ఆరాధనకు మంచి సందర్భం. ఈ ఒక్క స్వామి అనుగ్రహం లభిస్తే ‘బ్రహ్మ విష్ణు మహేశ్వరుల’ కటాక్షాలు ఒక్కసారే లభిస్తాయని వేదపండితులు అంటారు. దత్తాత్రేయుడు నాలుగు యుగాలలోనూ దర్శనమిచ్చినట్లు పౌరాణిక సాహిత్యం చెబుతున్నది. ఈ స్వామివి పదహారు అవతారాలు. అవి: విశ్వంభరావధూత, మాయాముక్త, దత్తావధూత, ఆదిగురువు, సంస్కారహీన, దేవదేవ, దత్త దిగంబర, శ్యామకమల లోచన, యోగిరాజ, అత్రివరద, దిగంబరావధూత, యోగిరాజ వల్లభ, కాలాగ్ని శమన, లీలావిశ్వంభర, సిద్ధరాజ, జ్ఞానసాగర. దత్తాత్రేయుడు సమస్త విశ్వానికే ఆదిగురువు. ‘అనసూయాత్రి సంభూత/ దత్తాత్రేయ మహామతే/ సర్వదేవాది దేవత్వం/ మనుచిత్తం స్థిరీ కురు’ అంటూ ఆయనను ఆత్మశుద్ధితో ఆరాధించిన వారికి తప్పక పుణ్యఫలం లభిస్తుందని వేదపండితులు చెప్తారు. ఈ దత్తజయంతిని ఇలా సద్వినయోగపరచుకొందాం.

340
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles