ఎముకల నొప్పికి కారణమేంటి?


Tue,December 3, 2019 12:40 AM

osteoporosis
నా వయసు 62 సంవత్సరాలు. నాలుగేండ్లుగా ఎముకల నొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాను. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే ఏవో మందులు ఇచ్చారు. జాగ్రత్తగా ఉండకపోతే ఎముకలు విరిగే అవకాశం ఉంటుందన్నారు. టాబ్లెట్లు వాడుతున్నాను. నాకు ఎముకలు విరిగేంత సమస్య ఏమి వచ్చింది? ఇప్పుడు వాడుతున్న మందులతో సమస్య పోతుందా?

- రాజమణి, నర్సంపేట


మీకు ఆస్టియోపోరొసిస్‌ అనే సమస్య ఉంది. నెలసరి రావడం ఆగిపోయిన మహిళల్లో ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది. నెలసరి ఆగిపోవడంతో స్త్రీ హార్మోన్లు తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ తగ్గడం వల్ల ఎముకలపై ప్రభావం పడి, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దాంతో ఎముకలు గుల్లబారి పెళుసుగా తయారవుతాయి. అందువల్ల ఏ చిన్న దెబ్బ తగిలినా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే మిమ్మల్ని కింద పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ సమస్య ఉన్నప్పుడు కాల్షియం థెరపీ ఇస్తారు. అంటే కాల్షియం టాబ్లెట్లను సప్లిమెంట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్‌ డి కూడా తీసుకోవడం వల్ల కాల్షియం శోషణ పెరుగుతుంది.

కొందరికి ఈస్ట్రోజన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ కూడా అవసరం అవుతుంది. టెరిపారైడ్‌ అనే మందును కూడా ఆస్టియోపోరొసిస్‌కి వాడుతారు. ఇది పారాథైరాయిడ్‌ హార్మోన్‌ రూపం. ఇది ఎముకల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఈ మందులు వాడడం వల్ల గుల్లబారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఆస్టియోపోరొసిస్‌ వల్ల ఎముకలు విరిగే పరిస్థితి ఉన్నవారికి ఇది చాలా మంచి మందు. కాంబినేషన్‌ డ్రగ్‌ థెరపీ కూడా ఆస్టియోపోరొసిస్‌కి మంచి పరిష్కారం చూపుతుంది.

osteoporosis1

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles