ఆన్‌లైన్ షాపింగూ ఓ జబ్బే


Sat,November 9, 2019 01:09 AM

టెక్నాలజీ పెరిగిపోయింది. కూర్చున్న చోటికే కోరుకున్న వస్తువులు వస్తున్నాయి. కూరగాయల నుంచి మొదలు పెడితే.. ఆహారపదార్థాలు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఏది కావాలన్నా నిమిషాల్లో ముందుంటున్నాయి. అయితే విచ్చలవిడిగా ఆన్‌లైన్ షాపింగ్ చేయడం కూడా ఓ జబ్బేనంట. ఈ విషయం ఇటీవల ఓ సంస్థ సర్వేలో వెల్లడైంది. మీరూ ఆ జబ్బుతో బాధపడుతున్నారా?
survey
స్మార్ట్‌ఫోన్, ఇతరాత్ర డిజిటల్ మాధ్యమాల ద్వారా చాలామంది షాపింగ్ చేస్తుంటారు. అతిగా షాపింగ్ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగున్నది. ఈ నేపథ్యంలో గార్ట్‌నర్ అనే అంతర్జాతీయ కంపెనీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్ షాపింగ్ కోసం కస్టమర్లు వెచ్చించే మొత్తం 2022 నాటికి 10 శాతం పెరుగుతుందని గుర్తించింది. దీనివల్ల కోట్ల మంది అప్పుల బారిన పడతారని సర్వేలో వెల్లడైంది. కస్టమర్లు తరచూ షాపింగ్ చేసేలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్సనలైజేషన్ టెక్నాలజీ ద్వారా వారిని ఆకర్షిస్తాయని పేర్కొన్నది. ఈ సంస్థ చేసిన సర్వేను ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. ఆర్థిక అవగాహన లేకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగితే గార్ట్‌నర్ సర్వే నిజమే అవుతుందని పేర్కొన్నది. టెక్నాలజీ కారణంగా అడిక్టివ్ డిజార్డర్ల బారినపడే వారి సంఖ్య 2023 నాటికి మరింత పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నది. ఇలా ఆర్థిక పరిస్థితులను పట్టించుకోకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిదీ ఒక రకమైన మానసిక జబ్బే అని ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నది.

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles