పేలు పోవాలంటే..


Fri,November 8, 2019 01:25 AM

చాలామంది మహిళలు పేలు సమస్యతో బాధపడుతుంటారు. మాటిమాటికీ తలలో చెయ్యి పెడుతుంటారు. ఇంకా కొందరి జుట్టులో ఈనులు పేరుకుపోయి చూడడానికి వికారంగా
కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే పేల సమస్య నుంచి బయటపడవచ్చు.

hair
-సీతాఫల గింజలను బాగా ఎండబెట్టాలి. వాటిని పొడి చేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. దానిలో కొన్ని నీళ్లు కానీ, కొబ్బరి నూనె కానీ కలుపుకోవాలి. కొన్ని నీళ్లు కలుపుకొని కుదుళ్లకు పట్టించాలి. 3, 4 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారం రోజులు చేస్తే తలలోని పేలు పూర్తిగా తొలగిపోతాయి.
-10 వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా చేసుకోవాలి. వాటికి 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు మీద రాసి గంట తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
-కొద్దిగా వంటనూనెలో నిమ్మరసం, గ్రీన్ టీ పౌడర్, టీ స్పూన్ వెల్లుల్లి రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రుద్దుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే పేలు, ఈనులు తొలిగిపోతాయి. వారంలో రెండుసార్లు ఈ చిట్కాను పాటించవచ్చు.
-కొందరు పేను కొరుకుడు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటివారు మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే సమస్య తొలగిపోతుంది.
-పేను కొరుకుడు సమస్యతో బాధపడే వారు గురివింద గింజలను బాగా అరగదీసి తలకు పట్టిస్తే పేలు మాయమవుతాయి. పేను కొరుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

591
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles