ఈ తైలాలతో ఏకాగ్రత పెరుగుతుంది


Fri,November 8, 2019 01:21 AM

oil
గంధపు తైలం : గంధపు తైలానికి మనసును ప్రశాంతంగా ఉంచే గుణం ఉంది. ప్రాచీనకాలం నుంచి గంధంను రకరకాల పూజా కార్యక్రమాల్లో వాడుతున్నారు. ఈ తైలం వాసన పీల్చుతూ మెడిటేషన్ చేశామంటే.. ఇక మనసు హిమాలయాల్లో ఎగురుతున్నట్లుంటుంది.


లావెండర్ ఆయిల్ : ఈ పూల గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం వాటిని రకరకాల కాస్మొటిక్స్‌లో వాడుతున్నారు. ఇది శరీరాన్ని రిలాక్స్ చెయ్యగలదు. ఈ తైలపు మృదుతత్వం మైండ్‌ను కూల్‌గా ఉంచుతుంది. పక్కన వాళ్లు రెచ్చగొట్టినా కామ్‌గా ఉంటాం. చెడు ఆలోచనలు, బాధలు, అశాంతి అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

క్లారీ సేజ్ : ఇది ఒక రకమైన మొక్క. ఇది చెడు ఆలోచనలను తరిమికొట్టగలదు. ఏకాగ్రత పెంచుతుంది. మనసును శ్వాసపైనే ధ్యాస పెట్టేందుకు వీలు కలిగిస్తుంది. మెమరీ పవర్ పెంచే శక్తి కూడా దీనికి ఉంది. ఈ మూడు తైలాలను రోజుకో రకం వాడినా చాలు.. ప్రశాంతమైన ధ్యానం మీ సొంతమవుతుంది. ఈ తైలాలు సూపర్‌మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చుకోవచ్చు. కాస్తరేటు ఎక్కువైనా ఇవి కలిగించే ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వీటిని కొనుక్కుంటున్నారు.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles