అద్దెకు ఐఫోన్లు


Wed,November 6, 2019 01:11 AM

i-phone
ఐఫోన్ ఇప్పుడు స్టేటస్ సింబర్. చాలా మందికి ఈ ఫోన్‌ను వాడడం ఒక కల. కానీ మధ్యతరగతి వ్యక్తులకు ఇది అందని ద్రాక్ష. కాబట్టి యాపిల్ కంపెనీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్య తరగతి వ్యక్తులు కూడా యాపిల్ ఫోన్లను వాడే అవకాశాన్ని కలిగించింది.
యాపిల్ ఐఫోన్లను అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఆపిల్ సంస్థ సరికొత్త ప్రణాళికను రూపొందించింది. అవసరమైన వారికి ఈ ఫోన్లను అద్దెకు ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్టు టెక్ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి నెలా అద్దె కట్టే విధంగా దీనికి కూడా అద్దె చెల్లించి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం అది వాడుకునే సమయంలో సరికొత్త మోడల్ ఏదైనా రిలీజ్ అయితే.. ఈ ఫోన్‌ను తిరిగి ఇచ్చేసి కొత్త ఐఫోన్‌ను తీసుకోవచ్చు. త్వరలోనే ఐఫోన్లను అద్దెకు ఇచ్చే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక అద్దెకు తీసుకున్నవారు ఐక్లౌడ్, ఐట్యూన్స్ వంటి సర్వీసులకు అదనంగా డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఈ కార్యక్రమం చేపడతామని సంస్థ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

349
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles