కండ్లు భద్రం..


Wed,October 30, 2019 01:27 AM

google
రోజూ బ్రౌజింగ్‌ చేస్తూ ఉంటాం. దాని కోసం క్రోమ్‌ ఎక్కువ వాడుతారు చాలామంది. ఇలా నిరంతరం స్క్రీన్‌ను చూడడం ద్వారా కండ్లమీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే క్రోమ్‌లో డార్క్‌ మోడ్‌ ద్వారా బ్రౌసింగ్‌ చేస్తే ఆ ప్రమాదం తక్కువ ఉంటుంది. అందుకే పలు డివైజ్‌లలో డార్క్‌ మోడ్‌ క్రోమ్‌ ఎలా వాడాలో చూడండి.


ఆండ్రాయిడ్‌

స్మార్ట్‌ ఫోన్‌ అన్నాక నెట్‌ లేకుండా ఉండదు. కాబట్టి బ్రౌజింగ్‌ చేసేటప్పుడు డార్క్‌ మోడ్‌లో చేసుకుంటే మంచింది. గూగుల్‌ క్రోమ్‌లో డార్క్‌ మోడ్‌ ఉపయోగించాలంటే అడ్రెస్‌ బార్‌ లోchrome://flags అని టైప్‌ చేయాలి. డైలాగ్‌ బాక్స్‌ మీకు ఓపెన్‌ అవుతుంది. అందులో ‘ dark mode’ అని టైప్‌ చేసి ఎంటర్‌ చేయాలి. ‘Android web contents dark mode’, ‘Android chrome UI dark mode’ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో దేన్నయినా ఎంచుకోవచ్చు. అంతే మీ ఆండ్రాయిడ్‌ డివైజ్‌ లో గూగుల్‌ క్రోమ్‌ డార్క్‌ మోడ్‌ ఎనేబుల్‌ అయినట్లే.

విండోస్‌ 10

కంప్యూటర్‌లోని సెట్టింగ్స్‌ మెనూలోకి వెళ్లాలి. పర్సనలైజేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని ద్వారా కలర్స్‌ ను ఓపెన్‌ చేసి అక్కడ Choose your default app mode ను ఎనేబుల్‌ చేయాలి. దాన్ని డార్క్‌ కు మారిస్తే.. క్రోమ్‌ ను రీస్టార్ట్‌ చేయకుండానే డార్క్‌ మోడ్‌ ఎనేబుల్‌ అయిపోతుంది.

మాక్‌ ఓఎస్‌ సాఫ్ట్‌వేర్‌

సిస్టం ప్రిఫరెన్సెస్‌ ఓపెన్‌ చేయండి. అందులో జనరల్‌పై క్లిక్‌ చేసి.. అప్పియరెన్స్‌ను ఎంచుకోండి. ఇక అక్కడ కనిపించే ఆప్షన్లలో డార్క్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి. అంతే డార్క్‌ మోడ్‌లోకి మారిపోతుంది.

277
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles