కనుబొమ్మలు వాస్తే..


Mon,October 21, 2019 12:43 AM

కాలేజీ అమ్మాయిల నుంచి ఆఫీసుకు వెళ్ళే మహిళల వరకు కనుబొమ్మలను మంచి ఆకారంలో తీర్చి దిద్దుతారు. అందుకు థ్రెడింగ్, ప్లకింగ్, వ్యాక్సింగ్ చేయడం వల్ల కనుబొమ్మల ప్రదేశంలో వాపు, దురద, మంట అధికంగా ఉంటుంది. నొప్పి బాధ నుంచి మిముక్తి పొందేందుకు ఇలా చేయండి.
eyebrows
-సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. థ్రెడింగ్‌ను సరైన పద్ధతిలో చేయకపోయినా, చేయడం రాకపోయినా చర్మం నలిగి నొప్పికి దారితీస్తుంది. అలాంటి సమయంలో మాత్రమే చర్మం ఎర్రగా మారుతుంది.
-పొడిచర్మం ఉన్నవారికి కూడా థ్రెడింగ్ చేసేటప్పుడు నొప్పికి కలుగుతుంది. ఈ రకమైన చర్మంపై థ్రెడింగ్ వల్ల ఎరుపు, దద్దుర్లు వస్తాయి.
-పొడిచర్మంతోపాటు జిడ్డుచర్మం కూడా ప్రమాదమే. జిడ్డుగల చర్మంపై చిన్న జుట్టును తొలిగించడం అంత సులభం కాదు. అందువల్ల చర్మంపై జుట్టును తొలిగించడం కష్టమవుతుంది.
-థ్రెడింగ్ చేయాలన్నా అనుభవం ఉండాలి. లేదంటే థ్రెడింగ్ సమయంలో వెంట్రుకలకు బదులుగా చర్మాన్ని కట్ చేస్తారు. దీంతో నొప్పి అధికంగా ఉంటుంది.


నివారణ

టోనర్ : ఇందులో కూలింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మంలో చికాకు, మంటను తగ్గిస్తుంది. పత్తిపై కొద్దిగా టోనర్ వేసి ప్రభావిత ప్రదేశంలో ఐప్లె చేయాలి. థ్రెడింగ్ తర్వాత తెరుచుకున్న చర్మ రంధ్రాలను టోనర్ మూసివేస్తుంది.
కలబంద : ఇందులో చర్మ శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మం ఎరుపు, మంట, వాపు, మొటిమలను నయం చేస్తుంది. థ్రెడింగ్ చేసిన వెంటనే కలబందను ఐప్లె చేయాలి.
దోసకాయ : దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కనుబొమ్మలపై 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత థ్రెడింగ్ చేస్తే నొప్పి లేకుండా చేస్తుంది. దీంతోపాటు వాపు రాకుండా చూసుకుంటుంది.

జాగ్రత్తలు

-థ్రెడింగ్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. థ్రెడింగ్ తర్వాత ఫేషియల్స్, బ్లీచ్ చేయించుకోవాలి. వేడి వాతావరణంలో ఉండకూడదు. ముఖానికి ఆవిరి పట్టకూడదు.

975
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles