ధనలక్ష్మికి స్వాగతం


Sun,October 20, 2019 12:53 AM

Ila-cheddam
నరక చతుర్దశికి ముందురోజు ‘ధన త్రయోదశి’. ఈరోజు అటు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. లక్ష్మీదేవి పాలకడలిలోంచి ఆవిర్భవించిన పుణ్యదినంగానూ ఈ పర్వదినాన్ని హైందవులు భావిస్తారు. ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్నింటికీ లక్ష్మిదేవియే అధిష్టాన దేవత. ఆమె ఆనుగ్రహంతోనే ఏ సంపదలైనా మనకు లభించేవి. అలాగే, అష్టదిక్కులలోని ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుని ధనసంరక్షకునిగా భావిస్తారు. ప్రత్యేకించి ధన త్రయోదశినాడు ఎంతో కొంత బంగారం కొని పూజించాలన్న సంప్రదాయాన్నికూడా కొందరు పాటిస్తున్నారు. ఆ రోజు చేయలేకపోయిన వారు దీపావళి పర్వదినానైనా విధిగా లక్ష్మీపూజ జరుపుకొంటారు. చిన్న వ్యాపారస్తుల నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకు ప్రతి ఒక్కరూ ఉన్నంతలో దీనిని వైభవంగా ఆచరిస్తారు. ప్రతీ ఇల్లూ, వాకిలి ఈ శుక్రవారం (25వ తేది) నుంచే పండుగ కళను సంతరించుకొంటాయి. నిజానికి ఏది అసలైన ఐశ్వర్యం? మన:శాంతిని మించిన ఆనందం ఎక్కడుంటుంది? ఉన్న దాంట్లోనే సంతృప్తి పడడం అందరికీ చేత కాకపోవచ్చు. కానీ, ఉండికూడా లోభత్వాన్ని చూపడం, లేకున్నా ఉన్నట్టు ఆర్భాటాలకు పోవడం రెండూ మంచివి కాదని వేదపండితులు అంటారు. అన్నింటికంటే ముఖ్యం పవిత్రమైన భక్తి మాత్రమే కదా.

883
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles