చిన్నారులకు ఇండో వెస్ట్రన్‌లుక్


Fri,October 18, 2019 01:41 AM

పండుగలు, పబ్బాలకే పిల్లలను రెడీ చేసే రోజులు పోయాయి. లంగాజాకెట్ల నుంచి ఫ్రాక్, క్రాప్‌టాప్‌లు వచ్చేశాయి. పిల్లలతో ప్రతీరోజునూ పండుగలాగే జరుపుకోవడానికి ఈ కొత్తరకం దుస్తులు బాగా నప్పుతాయి. పండుగ, శుభకార్యం, పార్టీ.. సందర్భం ఏదైనా వెస్ట్రన్ ైస్టెల్ లుక్‌లో అదరగొట్టొచ్చు. మరీ మీ పిల్లల్ని చూడముచ్చటగా చూడాలనుకుంటున్నారా? వెస్ట్రన్ ైస్టెల్‌లో ఉన్న కొన్ని డిజైన్లను మీకు అందిస్తున్నాం.
Fashan
1. ట్రెడిషనల్ లుక్ కోసం లంగాజాకెట్ వేయాల్సిందే. పర్పుల్ కలర్‌ను జాకెట్‌గా ఎంచుకున్నాం. నెక్‌కు పర్పుల్ వెల్‌వెట్ ప్లేన్ డిజైన్ చేసి దానిమీద గోల్డ్ కలర్ జర్దోసీ వర్క్ చేశాం. దీనిమీద సీక్వెన్స్ వర్క్‌తో అక్కడక్కడా బుటీస్ ఇచ్చాం. స్లీవ్స్ కూడా నెక్ మాదిరిగానే జర్దోసీ వర్క్ చేశాం. బ్లూ కలర్ రా సిల్క్ లంగా ఇచ్చాం. దీనిపైన థ్రెడ్‌వర్క్‌తో ఫ్లవర్స్‌లా డిజైన్ చేశాం. మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. గోల్డ్ కలర్ లేస్‌తో ఫినిషింగ్ ఇచ్చాం.


2. ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటే దీన్ని ఎంచుకోండి. ఫ్లోరల్ ఆర్గంజా లాంగ్ ఫ్రాక్. లైట్ ఆరెంజ్ నెట్ క్లాత్‌పై సీక్వెన్స్ వర్క్ చేశాం. దీనికి సింగిల్ స్లీవ్ ఇచ్చాం. బ్లూ కలర్ ఆర్గంజా క్లాత్‌ను మూడు లేయర్లతో వేసి స్లీవ్ కుట్టాం. దీంతో ఫ్రాక్ మంచి లుక్ వచ్చింది.

3. ైస్టెలిష్‌గా కనిపించేందుకు ఈ క్రాప్‌టాప్ సరైంది. పీచ్ కలర్ రాసిల్క్ బ్లౌజ్. నెట్‌క్లాత్‌ను స్లీవ్స్‌గా ఇచ్చాం. చిన్న ఫ్రిల్స్‌తో స్లీవ్స్ కుట్టడంతో లుక్ రెట్టింపైంది. ప్యారెట్ గ్రీన్ నెట్ క్లాత్‌ను లెహంగాగా తీసుకున్నాం. దీనికి అక్కడక్కడా పీచ్, పింక్ కలర్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం.
Fashan1
4. సింపుల్‌గా కనిపించే ఈ లాంగ్‌ఫ్రాక్ గ్రాండ్ లుక్‌నిస్తుంది. పింక్ కలర్ బ్లౌజ్ ఎంచుకున్నాం. దీనికి థ్రెడ్ వర్క్‌తో పాటు మెరిసేందుకు సీక్వెన్స్ వర్క్ ఇచ్చాం. షైనింగ్ రాసిల్క్‌తో ఫ్రిల్స్‌కు బదులుగా పెటల్స్ కుట్టాం. హాఫ్‌షోల్డర్ స్లీవ్స్ హైలెట్. పిస్తాగ్రీన్ ఆర్గంజా క్లాత్‌ను బాటమ్‌గా తీసుకున్నాం. మధ్యలో థ్రెడ్‌వర్క్‌తో డిజైన్ చేశాం. ఆర్గంజా క్లాత్‌నే స్లీవ్స్‌గా ఇచ్చాం.

5. నేచులర్ లుక్‌లో కనిపించాలంటే ఈ కాంబినేషన్ ఎంచుకోండి. పీచ్ కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ లెహంగా అదిరిపోతుంది. పీచ్ కలర్ రాసిల్క్ క్లాత్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. దీనికి ైప్లెన్ రాసిల్క్‌తోనే ఫ్రిల్స్ ఇచ్చాం. స్లీవ్‌లెస్ హ్యాండ్స్. ఎల్లో కలర్ నెట్ లెహంగాకు అక్కడక్కడా థ్రెడ్ వర్క్, చంకీలతో డిజైన్ చేశాం. బ్లౌజ్‌కు మ్యాచ్ అయ్యేలా టసెల్స్ వేలాడదీశాం.

సౌజన్యా రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్
[email protected]
చైనత్యపురి, హైదరాబాద్
Phone no. 8885482564
https:/www.instagram.com/
sreemanvi_designs

785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles