బతుకు బండికి విదేశాల్లో బాటలు


Fri,October 18, 2019 01:33 AM

ఉపాధి కోసం ఆమె దుబాయ్ వెళ్లింది. కానీ రాను రాను అక్కడి నుంచి ఇంటికి తిరిగివెళ్లాలనే నమ్మకాన్ని కోల్పోయింది. అక్కడే దీర్ఘకాలిక ఉద్యోగాన్ని అన్వేషించింది. ఆమె స్ఫూర్తి చూసిన ఎన్నో కంపెనీలే కాదు దుబాయ్ ప్రభుత్వమే ఇప్పుడు ఆమెను ఉద్యోగానికి ఆహ్వానిస్తున్నది.
suja
కేరళకు చెందిన సుజ థంకచన్ దుబాయ్‌లో ఇప్పుడు ఓ ఉద్యోగం చేస్తున్నది. నిజానికి అది వట్టి ఉద్యోగమే కాదు. మహిళగా ఆమె స్ఫూర్తికి, పట్టుదలకు గుర్తింపు. సుజది కేరళలోని కొల్లామ్ జిల్లా. నాలుగేండ్ల కింద ఆమె ఉపాధి కోసం దుబాయ్ వెళ్లింది. మహిళల మీద తీవ్ర ఆంక్షలుండే ఆ ప్రాంతంలో సుజ తాత్కాలిక ఉద్యోగంలో చేరింది. పరిస్థితులు మారాయి. కేరళ తిరిగి రావడానికి ఆమెకు నమ్మకం లేదు. ఏదైనా దుబాయ్‌లోనే సాధించాలనుకుంది. భారీ వాహనాలు నడపడం ఆమెకు చిన్నప్పటి నుంచీ అలవాటు. వాళ్ల మామయ్య బస్సులు, ట్యాంకర్లు నడుపుతుండే వాడు. ఆ ప్రభావం ఆమెపై పడింది. ఎప్పటికైనా ఆమె అలాంటి వాహనాలను నడపాలనుకుంది. కేరళలోనే తొలుత కొంచెం నేర్చుకుంది. దుబాయ్ వెళ్లిన తర్వాత తెలిసిన మిత్రుని ద్వారా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో సహాయకురాలిగా చేరింది.


పిల్లలకు సాయం, బస్సు శుభ్రత, స్కూల్‌లో చిన్న చిన్న పనులు అన్నీ చేసేది. దీంతో యాజమాన్యం సుజను చాలా నమ్మింది.అలా మెల్లిగా ఆమె డ్రైవింగ్ వైపు అడుగులేసింది. శిక్షణ తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అక్కడ దరఖాస్తు చేసుకుంది. హెవీ వెహికిల్ లైసెన్స్ పొందాలంటే కఠినమైన శిక్షణ ఎదుర్కోవాలి. అవ్వన్నీ చేసింది సుజ. కానీ డ్రైవింగ్ టెస్టులో నాలుగైదు సార్లు విఫలమైంది. వాటినే అనుభవాలుగా మల్చుకొని చివరకు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందింది. భారీ వాహన లైసెన్స్ పొందిన భారతీయమహిళగా అక్కడ గుర్తింపు పొందింది. ఈమె గురించి విన్న ప్రైవేట్ ట్రావెల్స్, పాఠశాలలు ఉద్యోగాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. చివరికి అక్కడి ప్రభుత్వం కూడా ఉద్యోగానికి ఆహ్వానించింది. కానీ ఈమె మాత్రం మొదట్లో తనకు అవకాశం ఇచ్చిన పాఠశాల బస్సులకే డ్రైవర్‌గా పని చేస్తానని నిర్ణయించుకుంది.
suja1

8255
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles