ముఖకాంతి పొందండిలా..


Mon,October 7, 2019 12:04 AM

ఆకర్షణీయమైన ముఖకాంతి కోసం పలువురు నానా తంటాలు పడుతుంటారు కొందరు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే ప్రయోజనాలు పొందుతారు.
FARE-FACE
-ముఖం డల్‌గా కాంతివిహీనంగా ఉందా? చిన్న చిన్న చిట్కాలతో మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చవచ్చు. మీ చేతి వేళ్లతో చర్మానికి జీవకళ తీసుకురావచ్చు. కంటిపై ఎముకభాగం నుంచి ముక్కు వరకు అక్కడి నుంచి బుగ్గల ఎముక భాగాల వరకు మాయిశ్చరైజర్‌తో పైకి కిందకు నెమ్మదిగా మర్దన చేయాలి.
-నిద్రపోయే ముందు ముఖం పైనకు చూస్తున్నట్లుగా నిద్రించాలి. పక్కకు, బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు ఏర్పడే అవకాశం ఉన్నది. పడుకునే ముందు గ్లాసుడు నీళ్లు తాగితే ముఖచర్మానికి కావాల్సినంత ఆక్సీజన్ దొరుకుతుంది.
-ప్రతి రోజు నిద్రించే ముందు మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాలు ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే మసాజ్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని ఉండదు.
-పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచూ చేపలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది.
-సన్‌స్క్రీన్‌లు ఐప్లె చేసేటప్పుడు ముఖానికి రెండు వైపులా సమపాళ్లలో రాయాలి. గంధం పొడి, పసుపు, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కూడా ఇలా చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది.

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles