గేమింగ్ ఇయర్ ఫోన్స్ అదుర్స్


Wed,September 25, 2019 12:28 AM

గేమర్ల కోసం సాధారణ బడ్జెట్‌లో జీ9 ఇయర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ కంపెనీ క్లా వీటిని ఇటీవలే భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ear-phones
ప్రత్యేకంగా గేమర్ల కోసమే తయారు చేసిన ఈ ఇయర్ ఫోన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో 10 ఎంఎం సౌండ్ డ్రైవర్స్ ఉండడంతో నాణ్యమైన సౌండ్ ఉంటుందని కంపెనీ చెపుతున్నది. దీంతో పాటు వీటికి మైక్‌ను అమర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ మైక్ 360 డిగ్రీల్లో తిరగేందుకు సులువుగా ఉటుంది. ఇయర్‌ఫోన్స్‌పై మల్టీ ఫంక్షన్ బటన్‌ను ఇచ్చారు. కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ను కంట్రోల్ చేసే బటన్లు కూడా ఉన్నాయి. ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 1490 . కాగా అమెజాన్ ఆఫర్‌తో రూ.990కే లభిస్తున్నది.

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles