ఫోన్ పోయిందా? బ్లాక్ చేయండి


Wed,September 25, 2019 12:28 AM

మొబైల్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే బ్లాక్ చేసేందుకు వీలు ఉండేలా ఓ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా ఉంటుంది.
phone
దొంగతనానికి గురైన, పోయిన ఫోన్‌ను గుర్తించడానికి లేదా ఫోన్ బ్లాక్ చేయడానికి వీలు కల్పించేలా సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మొబైల్ పరికరాలను గుర్తించే 15 అంకెల ఐఎమ్‌ఈఐ నంబర్ల డేటాబేస్ రూపొందుతుంది. దీన్ని బ్లాక్ చేయొచ్చు. మీ మొబైల్ పోయినప్పుడు, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి హెల్ప్‌లైన్ నంబర్ 14422 ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డీఓటీ)కు తెలియజేయాలి. పోలీసులకు ఫిర్యాదు తర్వాత, డిఓటి ఐఎమ్‌ఈఐ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లోకి చేరుస్తుంది. దీంతో ఆ మొబైల్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడం కుదరదు. అదే ఈఎమ్‌ఈఐ నంబర్ ద్వారా, సెల్యులార్ ఆపరేటర్ ఫోన్ కు నెట్‌వర్క్ అందకుండా నిరోధిస్తారు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్‌ఈఐ డేటాబేస్‌కు అనుసంధానమై ఉంటుంది.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles