మోటరోల నుంచి ఫోన్, టీవీ


Wed,September 18, 2019 01:01 AM

ఎలక్ట్రానిక్ కంపెనీ మోటరోల స్మార్ట్ ఫోన్‌ను, టీవీని విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ మోటో ఇ6ఎస్ పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లోకి రానుంది.
moto1

ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.1 అంగుళాలు, ప్రాసెసర్: 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22, మెమొరీ: 4 జీబీ ర్యామ్, స్టోరేజీ : 64 జీబీ స్టోరేజ్, ఓఎస్ : ఆండ్రాయిడ్ 9.0 పై, కెమెరా : 13+ 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సల్, బ్యాటరీ : 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, రూ.7,999.

moto

అండ్రాయిడ్ స్మార్ట్ టీవీ :

స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఫస్ట్ లెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది మోటరోల. ఈ టీవీ లెడ్ రేంజ్ బేసిక్ 32 అంగుళాల నుంచి 65అంగుళాల 4K యూనిట్ వరకు ఉన్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ ఫేస్ పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. హెడీఆర్ 10 కంటెంట్ కోసం డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది. స్మార్ట్ టీవీ కిందిభాగంలో 20W-30W సౌండ్ బార్ (ఇన్‌బిల్ట్ ) ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు (వేరియంట్ ఆధారంగా) మోడల్స్ ఉన్నాయి. 178 డిగ్రీల వ్యూ యాంగిల్స్ డిస్ ప్లే ఉన్నట్టు మోటో తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లో సెప్టెంబర్ 29 నుంచి స్మార్ట్ టీవీ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. క్వాడ్ కోర్ మీడియా టెక్ చిప్ సెట్ , 2.25GB ర్యామ్, 16GB స్టోరేజీ, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి.

892
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles