స్టార్టప్‌లో సక్సెస్ అవ్వాలంటే?


Wed,September 18, 2019 12:59 AM

ఇప్పుడు స్టార్టప్‌ల ట్రెండ్ నడుస్తున్నది. యువత వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఓ స్టార్టప్ ప్రారంభిం చాలన్నా, ప్రారంభించిన తర్వాతనైనా అనుభవజ్ఞుల సలహాలు, మార్గనిర్దేశకత్వం ఉండాలి. అందుకే స్టార్టప్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ అనే నాన్‌ప్రాఫిట్ సంస్థ యువతను సమర్థవంతమైన స్టార్టప్ వ్యస్థాపకులుగా నిలబెడుతున్నది.
SLP-Hyderabad
చాలా రంగాల్లో దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు విజయవంతం అవుతున్నాయి. వ్యాపార రంగంలో అనుభవమున్న అనుపేంద్ర శర్మ యువ వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ లీడర్ షిప్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. దీని ద్వారా యువ వ్యాపా రులకు అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. స్టార్టప్ రంగంలో అసక్తి ఉన్న యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. చెన్నయ్, బెంగళూర్, ముంబైలలో ఈ తరగతుల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించిన తర్వాత ఎదురయ్యే అనుభవాలు, లోటుపాట్లు, మార్కెటింగ్ నైపుణ్యాలునేర్పిస్తారు. ఇప్పుడా ఆర్గనైజేషన్ హైదరాబాద్ కేంద్రంగా తరగతులను అక్టోబర్‌లో నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ తరగతులకు వెళ్లొచ్చు. దీని కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి, ఇంటర్వ్యూ తర్వాత క్లాసులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేది సెప్టెంబర్ 23 వరకూ ఉంది. https://bit.ly/2kFfiPh ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. startupleadership.comలో పూర్తి వివరాలుంటాయి.

459
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles