అందమైన కనుబొమ్మల కోసం..


Thu,September 12, 2019 04:47 AM

ibrows
కనుబొమ్మలు ముఖానికి మంచి లుక్‌ను ఇస్తాయి. వీటిని సరిచేసుకునేందుకు కొందరు తరచూ పార్లర్‌కు వెళ్తూ ఉంటారు. కొందరు సన్నని కనుబొమ్మలు కావాలనుకుంటే.. మరికొందరు దట్టమైన కనుబొమ్మలు కావాలనుకుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు.

- ముఖ ఆకృతికి తగినట్లుగా ఐబ్రోస్ ఉన్నప్పడే అందంగా కనిపిస్తారు. ఒక్కో రకమైన ముఖాకృతి కలిగిన వారికి ఒక్కో రకమైన ఐబ్రో షేప్ బాగుంటుంది. కోల ముఖం కలిగిన వారికి ఫుల్ ఐబ్రోస్ బాగుంటాయి. ముఖం గుండ్రంగా ఉన్నవారికి యాంగిల్డ్ ఐబ్రోస్ బాగుంటాయి. స్కేర్ ఫేస్ చిన్నగా ఉన్నవారికి వంపు తిరిగినట్లుగా ఉన్న కనుబొమ్మలు బాగుంటాయి.
- కనుబొమ్మలు ఒత్తుగా మారేందుకు ఉల్లిరసం ఉపయోగపడుతుంది. అందులో ఉండే సల్పర్ రక్తసరఫరా బాగా అయ్యేందుకు పనిచేస్తుంది. ఉల్లిరసాన్ని కనుబొమ్మలకు రాసి 40 నిమిషాల తర్వాత కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
- కలబందను కోసి, మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని కనుబొమ్మలపై మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయవచ్చు.
- దట్టమైన అందమైన కనుబొమ్మల కోసం ఆముదం, ఆలివ్ ఆయిల్ చక్కగా పనిచేస్తాయి. కనుబొమ్మలకు రోజూ ఆముదం రాస్తే మంచిది. ఆలివ్ ఆయిల్ రాసినా కనుబొమ్మలు బాగా ఓత్తుగా పెరుగుతాయి. కనుబొమ్మలు తేమగా ఉండేందుకు రోజూ రాత్రి వాసెలిన్ రాయవచ్చు.
- జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా నూనె రాస్తూ ఉంటాం. అదేవిధంగా కనుబొమ్మల వెంట్రుకలకు కూడా నూనె రాకుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రెండు చుక్కలు ఐబ్రోస్‌పై వేసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మల వెంట్రుకలకు పోషణ అందుతుంది.

423
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles