బెంగళూర్ వ్యోమగామి ఇతడే!


Thu,September 5, 2019 01:07 AM

చంద్రునిపై వ్యోమగామి నడుస్తున్నట్టు కొద్దిరోజుల నుంచి వీడియో ట్రెండ్ అవుతున్నది. అది చూసిన చాలామంది నిజంగా చంద్రుని మీదే అనుకున్నారు. కానీ కాదు.. బెంగళూర్‌కు చెందిన ఓ ఆర్టిస్ట్ అధికారులకు కనువిప్పు కలిగేలా ఈ వీడియో చేశాడు.
astronaut
నిజంగానే చంద్రుని నేల పైన నడిచినట్టు కనిపించిన ఈ వ్యోమగామి పేరు బాదల్ నజున్‌దస్వామి. బెంగళూర్‌లో పేరు పొందిన చిత్రకారుడు. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, వాటిపట్ల స్థానికులకు అవగాహన కలిగిస్తుంటాడు. ఆకర్షణీయమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటాడు. కేవలం చిత్రాలు వేయడంతోనే తన పని అయిపోయిందనుకోలేదు బాదల్. సామాజికపరమైన సమస్యలపై కొత్త తరహా ప్రయోగం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే వ్యోమగామిగా డ్రెస్ వేసుకొని బెంగళూర్ రోడ్లమీద వీడియో షూట్ చేశాడు. రోడ్డుమీద విపరీతమైన గుంతలు ఏండ్ల తరబడి అలాగే ఉన్నాయి. వీటి గురించి తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వీటి గురించి అధికారులకు తెలియజేయాలనుకున్నాడు. ధర్నాలు, నిరసనలు చేయడం రొటీన్. అందుకే సెటైరికల్‌గా ఆలోచించాడు. వ్యోమగామిగా అవతారం ఎత్తి, గుంతలు ఎక్కువ ఉన్న ఏరియాలో చంద్రునిమీద నడిచినట్టు నడిచాడు. ఇది మొదట అందరికీ చంద్రుని మీదే ఉన్నట్టు అనిపించింది. కానీ తర్వాతే తెలిసింది అవి బెంగళూరు రోడ్లు అని. ఈ వీడియోను అతను ఫేస్‌బుక్‌లో ఉంచి మున్సిపాల్ అధికారులకు ట్యాగ్ చేశాడు. ఇది కొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా పాకడంతో అధికారులు హుటాహుటిన స్పందించారు. వెంటనే ప్రొక్రెయిన్లను, సిబ్బందిని రంగంలోకి దించి ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చారు. దీంతో బెంగళూరువాసులు ఈ స్వామిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
astronate1

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles