కమాండర్ శాలిజా!


Thu,August 29, 2019 12:32 AM

చరిత్ర సృష్టించడం కొంచెం ఆలస్యం అవొచ్చేమో గానీ మహిళలు మాత్రం కచ్చితంగా ఆ పని చేయగలుగుతున్నారు. ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ రంగాల్లో మహిళలు రికార్డులు నెలకొల్పుతున్నారు. ఇటీవల ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా ైఫ్లెట్ కమాండర్‌గా శాలిజాధామి రికార్డు సృష్టించారు.
shaliza
ధైర్యంతో కూడిన నిర్ణయం. భయమే తెలియని బాధ్యతలు, పట్టు విడవకుండా విధులు. అంతిమంగా అనుభవం ఆ పై విజయం. కమాండర్ శాలిజా.. ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన నాటి నుంచి ఆ ప్రయాణం ఇలాగే సాగింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఆమె పైలెట్ కావాలని కలలు కన్నది. ఉన్నత విద్యలు అభ్యసించి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించింది. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించింది. వేర్వేరు విభాగాల్లో పని చేసిన అనుభవాన్ని సాధించింది. పెద్ద పెద్ద చాపర్లు నడిపి ప్రతిభ కనబర్చింది. తోటి పైలెట్లకు శిక్షకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. అప్పుడే మొదటిసారి వుమెన్ ైఫ్లెయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా ఫ్లయింగ్ యూనిట్‌కు ైఫ్లెట్‌కమాండర్‌గా బాధ్యతలు చేపట్టింది. యూపీలోని ఘాజియాబాద్ ఎయిర్ బేస్‌కు చెందిన చేతక్ హెలికాప్టర్ యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరించనున్నది. సింగిల్ ఇంజిన్ టర్బో షాఫ్ట్ కలిగిన ఈ చేతక్ గంటకు 220కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీన్ని సెర్చ్, రెస్క్యూ, అత్యవసర వైద్యసేవలు, మెటీరియల్ ట్రాన్స్‌ఫర్ తో పాటు ప్రత్యేక ఆపరేషన్ల సమయంలో వాడతారు. ఇలాంటి యూనిట్‌కు కమాండర్‌గా శాలిజా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

210
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles