ఆరోగ్యానికి అనాస!


Thu,August 29, 2019 12:29 AM

ఏ కాలంలో అయినా దొరికే పండు అనాసపండు. ఇది ఆరోగ్యానికి ముఖ్యంగా మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. అనాసలో ఉండే పోషకాలు ఏ విధంగా మేలుచేస్తాయో తెలుసుకోండి.
pine-apple
-ఈ ఫలంలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో నీరు చేరిన వారు అనాస తింటే మంచిది.
-అనాసలో పీచు పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి దాని పనితీరును మెరుగు పరుస్తుంది. మలబద్దకం ఉన్నవారు ప్రతిరోజూ రాత్రిపూట నాలుగు అనాస ముక్కలు తింటే ఆ సమస్య దూరమవుతుంది.
-రక్తలేమి ఉన్నవారికి అనాస మంచి ఆహారం. దీనిలోని పోషకాలు ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతాయి. రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. అన్ని అవయవాలకు ప్రాణవాయువు సరిగ్గా సరఫరా అవుతుంది.
-జీవనశైలిలో మార్పులూ, ఆహారపు ఆలవాట్ల వల్ల కొందరికి జీవక్రియ రేటులో అసమానతలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యకు అనాసతో చెక్ పెట్టొచ్చు. ఇందులోని మాంగనీస్, విటమిన్ -సీ, థియామిన్ (బి1) శరీరంలోని అరోగ్య కణాల పనితీరులో, ఆరోగ్యకరమైన జీవక్రియలో కీలకంగా పనిచేస్తాయి.
-మంట, నొప్పులను తగ్గించే గుణాలు ఈ పండులో ఉన్నాయి. మోకాళ్లు, కండరాల సమస్యలున్నవారు ఇవి తినడం చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు అనాసపండు తీసుకుంటే మంచిది. కొన్ని ముక్కలు తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హాని చేసే కొవ్వుతో పోరాడుతాయి.

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles