కుక్కకు రిమోట్‌ కంట్రోల్‌..


Wed,August 14, 2019 12:37 AM

కుక్కకు ప్రత్యేకమైన షూట్‌తో రిమోట్‌తో కంట్రోల్‌ చేసే విధానాన్ని కనుగొన్నారు ఇజ్రాయెల్‌ రోబోటిక్స్‌ లాబొరెటరీ సభ్యులు.. నోటితో కాకుండా రిమోట్‌తో కమాండ్స్‌ ఇచ్చి కుక్కను కంట్రోల్‌ చేయవచ్చు.
DOG
రిమోట్‌ కంట్రోల్‌ షూట్‌ కుక్కకు తొడిగేతే మనం పిలువాల్సిన పనిలేదు. కమాండ్స్‌ ఇస్తే చాలు. ‘తాయ్‌' అని పిలిచే ఈ కుక్క దానికి తొడిగిన ప్రత్యేకమైన కోటు సహాయంతో ఆదేశాలు తీసుకునేలా శిక్షణ పొందుతున్నది. ఇజ్రాయెల్లోని బీజీ యూనివర్శిటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రోబోటిక్స్‌ లాబొరేటరీ వారు ఈ ప్రయో గం చేస్తున్నారు. మొదట ఈ కుక్కను ఆంధులకు సాయం చేసేందుకు మామూలు శిక్షణ ఇవ్వాలనుకున్నారు. కానీ వారి సూచనలు పాటించకుండా సమయాన్ని వృథా చేసింది. ఎలానైనా చెప్పింది చేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి టెక్నాలజీని వాడి కుక్కను కంట్రోల్‌ చేయాలనుకున్నారు. అందుకే ఈ కోటును తయారు చేశారు. రిమోట్‌లో బటన్‌ నొక్కగానే ఈ కోటులో కొన్ని రకాల కదలికలు (వైబ్రేషన్స్‌) వస్తాయి. దాని ఆధారంగా తాయ్‌ స్పందించడం మొదలైంది.‘నోటితో ఇచ్చే కమాం డ్స్‌ కన్నా రిమోట్‌తో ఇచ్చే కమాండ్లకు తాయ్‌ మెరుగ్గా స్పందిస్తున్నదని ఈ కోటుపై పరిశోధనలు చేసిన బృందం అంటున్నది. యజమానికి కనిపించనంత దూరంలో కుక్క ఉన్నప్పుడు దాన్ని పిలిచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఆరేండ్ల వయసున్న తాయ్‌ ప్రస్తుతం తిరగడం, కూర్చోవడం, దగ్గరకు రావడం, వెనక్కి వెళ్లడం వంటి ఎన్నో పనులను రిమోట్‌ ద్వారా ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేస్తున్నది.

607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles