నాస్తికత్వానికి మూలం


Fri,August 9, 2019 12:51 AM

కొందరు దేవుడు లేడని, భక్తి, ఆధ్యాత్మికత అంతా వట్టి మూఢత్వమని విపరీతమైన నాస్తిక భావనలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వారిలో చాలామంది జీవితంలో అంతా అయిపోయాక, వృద్ధాప్యదశలో ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుందనడానికి భగవద్గీతలోనే సరైన కారణం ఉన్నది. న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యన్తే నరాధమా:/ మాయయా పహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితా: (15-7). దీని ప్రకారం అలాంటి వారంతా అటువంటి దుష్కృతి బారిన పడడం ఎందుకంటే, గత జన్మ వాసనల వల్ల అని శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడే పేర్కొన్నారు. ఈ సత్యం తెలుసుకోకుండా వారిని మాయ కమ్మి ఉంటుంది. సత్వ, రజ, స్తమోగుణ రూపమైన ఆ మాయ అంత త్వరగా తొలిగేది కాదు కూడా. ఫలితంగానే వారిలో నాస్తికత్వం ప్రబలుతుందని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు.

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles