సొంత ఊరిని దత్తత తీసుకున్నది!


Thu,August 8, 2019 01:09 AM

ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకుంటారు. అదే రోడ్ల మీదకి వస్తే పరిస్థితి మారిపోతుంది. మనం శుభ్రం చేయం కదా.. మనకెందుకులే అనుకుంటారు. ఆమె అలా నాకెందుకులే అనుకోకుండా సొంత ఊరుని పరిశ్రుభంగా తీర్చిదిద్దుతున్నది.
tejaswi
ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు చెందిన తేజస్వి పోడపతికు పుట్టిన ఊరంటే ఎంతో గౌరవం. ఊరు గురించి ఎవరేదైనా అంటే తట్టుకునేది కాదు. కాకపోతే తన నగరం పాడైపోతున్న విషయాన్ని గమనించింది. అందుకు కారణం గోడలకు పిచ్చి పోస్టర్లే అని గ్రహించింది. దీనికి ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నది. విషయం ఇంట్లో చెప్పగానే పోస్టర్లు చించుకుంటుంటే ప్రజలు తేజస్విని పిచ్చిది అనుకుంటారేమో అని తల్లి భయపడింది. తండ్రి మాత్రం ప్రోత్సహించాడు. టీం ఏర్పాటుకు తండ్రి సహకారం కోరింది. 2015లో అబ్దుల్ కలాం జయంతి నాడు భూమి ఫౌండేషన్‌ని స్థాపించింది. 10 మంది వలంటీర్లతో మొదలైన ఈ ప్రయాణం 3500 మంది వలంటీర్లకు చేరింది. ప్రతివారం ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ఇలా ఒంగోలులో 125 ప్రదేశాలు ఇప్పటి వరకు శుభ్రపరిచారు. చదువు పూర్తయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తేజస్వి జీతంలో 70 శాతం ఫౌండేషన్‌కు ఖర్చు పెడుతున్నది. ప్రతీ శుక్రవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి వెళుతుంది. రెండేండ్ల నుంచి భూమి ఫౌండేషన్ ఒంగోలు, హైదరాబాద్ పరిసరాలను కూడా క్లీన్ చేస్తున్నది. హైదరాబాద్‌లో 80కి పైగా ప్రదేశాలను శుభ్రపరిచినట్టు చెబుతున్నది తేజస్వి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కొంత సామగ్రిని ఇవ్వమని అడుగాలనుకుంటున్న తేజస్వి మున్ముందు ఇంకెన్ని పనులను చేపడుతుందో చూడాలి.
tejaswi1

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles