ఆర్గానిక్ క్వీన్..యూట్యూబ్ స్టార్!


Thu,August 8, 2019 01:08 AM

ఇంటి వెనకాల ఉన్న ఎకరం స్థలంలో చిన్నపాటి తోట వేసింది. ఆ ఆనందాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టింది. అనుకోకుండా వచ్చిన స్పందనతో ఇంకా వీడియోలు పెట్టింది. అలా ఆమె కొన్ని రోజులకు యూట్యూబ్ స్టార్ అయింది.
Annie
కొచ్చిన్‌లో నివాసం ఉంటున్న అన్నీ యూజిన్‌కు గార్డెనింగ్ అంటే ఇష్టం. ఆమె ఇంటి వెనకాల ఓ ఎకరం స్థలం ఉంది. అందులో గార్డెనింగ్ చేయాలనుకుంది. 2012లో గార్డెనింగ్ ప్రారంభించింది. ఆ సందర్భంలో ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టింది. దానికి మొదట 3వేల వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా రావడంతో తర్వాత మరో వీడియో కూడా పెట్టింది. దీనికి ఇంకా వ్యూస్, కామెంట్స్ పెరిగాయి. అప్పుడే అనుకుంది యూట్యూబ్ చానెల్ ప్రారంభించాలని. కృషి లోకం పేరుతో చానెల్ స్టార్ట్ చేసింది. ఆర్గానిక్ సాగు విధానాన్ని, ఎరువుల తయారీని, హోంగార్డెనింగ్ చిట్కాలను అన్నింటినీ వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో పెట్టడం స్టార్ట్ చేసింది. తోటలో పండించే టమాట, కాకర, ఉల్లి, మక్కజొన్న, జామ, దానిమ్మ పంటల గురించి వివరణలు, విధానాలు అన్నీ వీడియోలో చిత్రీకరించేది. ఎలాంటి సలహాలు ఉన్నా కామెంట్స్‌లో తెలియజేస్తే వాటిని క్లియర్ చేసేది. ఇట్లా నాలుగేండ్ల కాలంలోనే అనేక వీడియోలు తీసి యూట్యూబ్ స్టార్ అయింది. ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్‌కు 3లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఒక్కోవీడియోకు వేల హిట్లు ఉండడం విశేషం. ఈ వీడియోల ద్వారా ఆమె నెలకు లక్ష రూపాయలు పొందుతున్నట్టు చెప్తున్నది. ఆమెకు తోటపని అంటే ఇష్టం అని కానీ దాన్ని కమర్షియల్‌గా ఎప్పుడూ ఆలోచించలేదని అంటున్నది.

594
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles