ముఖం మెరువాలంటే..


Thu,August 8, 2019 01:07 AM

వర్షాకాలం కొంతమంది ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఓ పక్క చల్లని వాతావరణమున్నా.. కొందరికి శరీరంలోని వేడి కారణంగా మొటిమలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి పరిష్కారం పొందాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
Beauty
-రెండు చెంచాల బీట్ రూట్ రసం, చెంచా పాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖానికి మంచి రంగు వస్తుంది. ఇలా రోజు విడిచి రోజు నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-చెంచా చొప్పున బీట్‌రూట్ రసం, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం తెల్లగా మారుతుంది. ఇలా రోజు విడిచి రోజు చేయవచ్చు.
-గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకుని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. అందులో ఎగ్‌వైట్‌ను మిక్స్ చేసి ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత తడి బట్టతో తుడిచేసుకోవాలి. ఇది ఫేషియల్ టోనర్‌గా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి ప్రయత్నించవచ్చు.
-గుప్పెడు తులసి ఆకులు తీసుకుని, మిక్సీలో వేసి, రెండు టీ స్పూన్ల పెరుగు చేర్చి, మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి ఐప్లె చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
-కలబంద గుజ్జులో కొంచెం తేనె, పాలమీగడ, గులాబీ నీళ్లు కలిపి వాటన్నింటినీ మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి ఆరనివ్వాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ మచ్చలు, కాలిన గాయాలు మొటిమల తాలూకూ మచ్చలు తొలగిపోతాయి.

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles