22 ఏండ్లు ఒంటరిగానే !


Thu,August 8, 2019 01:06 AM

అందరితో సరదాగా కబుర్లు చెబుతూ గడపడం కొంతమందికి అలవాటు. మరికొందరు మాత్రం ఒంటిరిగా జీవించడాన్నే ఇష్టపడుతుంటారు. ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఏండ్లుగా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఎందుకంటే?
robert
కాలిఫోర్నియాలోని సెర్రోగోర్డో నిర్మానుశ్య పట్టణ ప్రాంతం. రాబర్ట్‌ లూయిస్‌ డెస్మరైస్‌ అనే వ్యక్తి వెండి నిక్షేపాల కోసం రెండు దశాబ్దాలుగా శోధిస్తూనే ఉన్నాడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా నిధుల కోసం మారుమూల ప్రాంతాల్లో గాలించేవాడు. కొన్నాళ్ల తర్వాత వెండి నిక్షేపాల జాడను తెలుసుకునేందుకు సెర్రోగోర్డోలోనే జీవించడం మొదలుపెట్టాడు. సెర్రోగోర్డో (స్పానిష్‌లో లావైన కొండ అని అర్థం) ఒకప్పుడు కాలిఫొర్నియాలోనే ప్రధానమైన వెండి గనిగా ఉండేది. లాస్‌ ఏంజిల్స్‌ నిర్మించడానికి కూడా ఈ వెండి గని సహాయపడిందట. ఇంకా ఇక్కడ వెండి పుష్కలంగా ఉందని ఆయన నమ్ముతున్నాడు. అందుకే 800 అడుగుల రాళ్లను సైతం పలగొట్టే పనిలో పడ్డాడు. ‘ఆ గనులను కనిపెట్టగలననే నమ్మకంతోనే ఉన్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నా” అని డెస్మరైస్‌ చెబుతున్నాడు.

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles