వింత ఆచారం !


Thu,August 8, 2019 01:05 AM

75 కిలోల ఎండు మిరపకాయలను దంచి ఆ కారాన్ని నీటిలో కలిపి అభిషేకం చేస్తారు. దేవాలయంలోని దేవుడికి కాదు అర్చకుడికి! ఈ వింత ఆచారం ఓ చోట ఉన్నది. ఎక్కడో తెలుసా?
priest
తమిళనాడు ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలోఆడి అమావాస్య సందర్భంగా కరుప్పు స్వామి ఆలయంలో ఈ వింత ఆచారం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఏటా ఆడి (ఆషాడ)అమావాస్యను పురస్కరించుకుని కరుప్పు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ అర్చకుడికి కారం నీటితో అభిషేకం చేస్తారు. అర్చకునికి అభిషేకం నిర్వహించే ఘట్టాన్ని అందరూ ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. అభిషేకం అనంతరం అర్చకుడు చెప్పే ఉపదేశాన్ని శ్రద్ధగా వింటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ అభిషేకం కోసం 75 కిలోల ఎండుమిరపకాయలను దంచి కారం పొడిని తయారు చేస్తారు. ఆ పొడిని భక్తులు అందరూ చూస్తుండగా బిందెల కొద్దీ కారపు నీళ్లను ఆలయ అర్చకునికి అభిషేకం చేస్తారు. కరుప్పు ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా జరిగే ముఖ్యమైన ఘట్టమిది.

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles