ఈ ఏసీని తగిలించుకోండి..


Wed,July 31, 2019 12:33 AM

బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా ఏసీని వెంటబెట్టుకొని వెళ్లొచ్చు. అదేంటి ఏసీని పట్టుకొని వెళ్లడం ఏంటీ అనుకుంటున్నారా? అలాంటి దాన్నే జపాన్ కంపెనీ తయారు చేసింది.
new-Gadget
వాతావరణంలో ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా తట్టుకోవడం కష్టం. వీటి నుంచి ఉపశమనం కోసం ఏసీలు, రూమ్ హీటర్లు వాడుతాం. కానీ బయటకెళ్లేటప్పుడు పరిస్థితి ఏంటి? దీనికి పరిష్కారంగా ధరించడానికి వీలుగా ఉండే ఎయిర్ కండిషనర్ (ఏసీ)ను జపాన్ కంపెనీ ఆవిష్కరించింది. దీన్ని రియన్ పాకెట్‌గా పిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లితే అక్కడికి దీన్ని ధరించి తీసుకెళ్లొచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా అవసరాలకు అనుగుణంగా ఈ పాకెట్ ఏసీని నియంత్రించవచ్చు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీని 2 గంటలపాటు చార్జింగ్ పెడితే.. రోజంతా ఏసీని పొందవచ్చు. సోనీ రియాన్ పాకెట్ ధర ఎంతో తెలుసా.. రూ.8,950.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles