ఘనమైన గద్వాల్!


Fri,July 12, 2019 01:19 AM

పట్టు చీరంటే మక్కువ లేనిది ఏ మగువకో చెప్పండి! పట్టు మగువల మనసుల్ని కనికట్టు చేస్తూనే ఉంటుంది. కంచి.. ధర్మవరం.. గద్వాల్.. ఇలా తీరొక్క పట్టు.. తమ వార్డ్‌రోబ్‌లో భద్రంగా ఉంచుకోవాలనుకుంటారు పడతులు.. ఆషాఢం నడుస్తున్నది.. వచ్చేది శ్రావణం.. ఆ సమయంలో.. అందరిలో ఘనంగా కనిపించకపోతే ఎలా?! అందుకే బెటర్ ఆప్షన్ అంటే.. వెంటనే గుర్తొచ్చేది గద్వాల్! జరీ మెరుపులు.. టెంపుల్ డిజైన్ తళుకులు.. రాయల్ లుక్‌తో ఇట్టే కట్టిపడేస్తాయి.. మరి ఆ పట్టును మెచ్చే పడతుల కోసం ఈ వారం ఫ్యాషన్..
Fashan
పసుపు-ఎరుపు, పసుపు - ఆకుపచ్చ ఈ కాంబినేషన్స్ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి. కానీ మూడు రంగుల కలయికతో నేసిన చీర కచ్చితంగా మనసులను దోచుకుంటుంది. ఒకవైపు ఎర్రని, మరోవైపు ఆకుపచ్చని బార్డర్‌తో వచ్చిన గద్వాల్ చీర ఇది. దీనికి ఆకుపచ్చ రంగు పట్టు బ్లౌజ్‌ని హైనెక్‌గా డిజైన్ చేశాం. స్లీవ్స్‌కి మాత్రం ఎర్రని పట్టు జరీ బార్డర్‌ని జత చేశాం. బ్లౌజ్‌కి అక్కడక్కడ ఇచ్చిన కుందన్స్ మరింత మెరిసిపోతున్నాయి.


వంకాయ రంగు గద్వాల్ పట్టు చీర మీద మొత్తం గుర్రం, జింక డిజైన్‌ల జరీ వచ్చేసింది. చీర మొత్తం ఈ బొమ్మలు కనిపిస్తాయి. ఇక ఎర్రని బార్డర్ చెక్స్ ప్యాటర్న్‌తో వచ్చింది. ఎర్రని పల్లూ మీద నెమలి నాట్యం చేస్తున్న జరీ రావడంతో సూపర్‌గా కనిపిస్తున్నది. వంకాయ రంగు పట్టు బ్లౌజ్‌ని హై నెక్‌తో డిజైన్ చేశాం. ఎలాంటి వర్క్ చేయకుండా సింపుల్ లుక్‌ని ఇచ్చాం.

ఎర్రని గద్వాల్ పట్టు చీర ఇది. చెక్స్ ప్యాటర్న్.. అక్కడక్కడా జరీతో వచ్చిన నెమలి పింఛాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక దీనికి వచ్చి గోల్డెన్ జరీ బార్డర్, రిచ్ పల్లూ మరింత మెరిసిపోతున్నాయి. బార్డర్ కింద చిలకాకుపచ్చ లైన్ కాంట్రాస్ట్‌గా బాగుంది. అందుకే ఇదే రంగు పట్టు బ్లౌజ్‌ని ఎంచుకున్నాం. మోడ్రన్ టచ్ ఉండడం కోసం స్లీవ్‌లెస్‌గా
డిజైన్ చేశాం.
Fashan1
ఈ కాంబినేషన్ ఎవరైనా ఇట్టే కట్టి పడేస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరకు ఎర్రని జరీ బార్డర్ వచ్చింది. దానికి కిందగా వచ్చిన టెంపుల్ డిజైన్ బార్డర్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. పల్లూ చీరకి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చింది. పూర్తి జరీ వచ్చిన పట్టు బ్లౌజ్‌ని దీనికి మ్యాచ్ చేశాం. సింపుల్‌గా కుట్టినా.. చీరకు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది.

రాయల్‌గా కనిపించేందుకు ఈ చీర కట్టాల్సిందే! బ్లూ కలర్ చెక్స్ ప్యాటర్న్ గద్వాల్ చీర ఇది. అక్కడక్కడ బుటీస్ వచ్చాయి. ఎర్రని జరీ బార్డర్ ఒక వైపు, మరో వైపు నెమళ్ల బార్డర్ వచ్చింది. రిచ్‌గా వచ్చిన పల్లూ చీర అందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఎర్రని పట్టు బ్లౌజ్‌ని సింపుల్‌గా డిజైన్ చేశాం. వెనుక వైపు హై నెక్, మోచేతుల వరకు హ్యాండ్స్ పెట్టడంతో సూపర్ లుక్ సొంతమైంది.

-పవులూరి నాగతేజ
-ఫ్యాషన్ డిజైనర్, తేజ శారీస్
-కూకట్‌పల్లి, హైదరాబాద్
[email protected]

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles