లేడీ బస్ డ్రైవర్


Fri,July 12, 2019 01:14 AM

డ్రైవింగ్ ఫీల్డ్‌లో అంతా పురుషులే ఉంటారు. అందులో భారీ వాహనాలు నడిపే వారిలో అయితే చెప్పనక్కర్లేదు. కానీ ప్రతిక్షా దాస్ అనే యువతి మాత్రం భారీ వాహనాలు నడపాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. వాటిని సాకారం చేసుకొని మొదటి మహిళా బస్ డ్రైవర్ అయింది.
pratiksha
ప్రతిక్షా దాస్ ముంబైకి చెందిన 24 ఏండ్ల అమ్మాయి. ఇప్పుడు ముంబైలో బెస్ట్ ఉమెన్ బస్ డ్రైవర్. ఆర్టీ నుంచి ఆ గుర్తింపు పొందింది. ప్రతిక్షకు బైక్‌లు, కార్లు నడపడం అంటే చాలా ఇష్టం. తను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే వాళ్ల మామయ్య బైక్‌ను నడిపింది. కేవలం రెండు రోజుల్లో పూర్తి బైక్ రైడింగ్ నేర్చుకొని కుటుంబీకులను ఆశ్చర్యపరిచింది. అక్కడ మొదలైన ఆమె ఆసక్తి మెల్లిగా కార్లు నడపడం వరకూ కొనసాగింది. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఆయె ఆర్టీవో అధికారి కావాలనుకున్నది. ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. దీంతో బస్‌ను నడపడం నేర్చుకున్నది. దీని కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంది. ట్రెయినర్లు ఇదంతా ఎందుకు అని అడిగితే డ్రైవింగ్ సీట్లో అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు? అని ఎదురు ప్రశ్నించేది. ఈమె మాటలకు వారు ఆశ్చర్యపోయేవారు. కొద్ది రోజుల్లోనే బస్ డ్రైవింగ్ నేర్చుకొని 16 కిలోమీటర్లు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేమీద బస్ నడిపి హెవీ వెహికిల్ లైసెన్స్‌కు అర్హత సాధించింది. దీంతో పాటు తొలి మహిళా బస్ డ్రైవర్‌గా కూడా సుపరిచితురాలైంది. ఇది తనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనీ, తనకు అంతర్రాష్ట్ర లగ్జరీ బస్సులను నడపాలనుందనీ, పైలెట్‌గా శిక్షణ తీసుకోవాలనుందని చెప్తున్నది.

1386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles