మృదువైన పెదాల కోసం!


Fri,July 12, 2019 01:12 AM

పెదవులు ఎర్రగా ఉండాలని కోరుకోని మహిళలుండరు. పెదవుల రంగు అందాన్నే కాకుండా ఆరోగ్యాన్ని సైతం సూచిస్తుంది. నల్లని పెదాలను సైతం ఎర్రగా మార్చుకునేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
Lips
-టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ మీగడ గిన్నెలో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మీ పెదవులకు రాసుకోవాలి. తర్వాత ఒక కాటన్ బాల్‌తో తుడుచుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతి రోజు ఇలా చేస్తే నెలలోపు పెదాలు నిగారింపును సంతరించుకుంటాయి.
-టేబుల్ స్పూన్ పాలు అలాగే కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని పాలల్లో వేసి బాగా కలపాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత దూదితో తుడుచుకోవాలి. దీనివల్ల పెదవులు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతాయి.
-అర టేబుల్ స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసుకోవాలి. కొంత సమయమయ్యాక చల్లటి నీటితో కడుక్కోవాలి. తర్వాత పెదాలు గులాబీ రంగులోకి మారడం గమనిస్తారు.
-బీట్రూట్ జ్యూస్ లాగే క్యారట్ జ్యూస్ కూడా మీ పెదవులను చక్కగా మారుస్తుంది. ఒక క్యారెట్‌ను తీసుకుని దానిని గుజ్జు చేసి ఆ రసాన్ని పెదాలకు రాసుకుంటే మంచిది. మీ పెదవులు పొడిబారినప్పుడల్లా ఈ జ్యూస్‌ను రాసుకుంటే మృదువైన గులాబీ రంగు పెదాలు మీ సొంతమవుతాయి.
-దోస ముక్కల్ని మీ పెదవులకు రాసుకుంటే ఎంతో బాగా పనిచేస్తాయి. ఇవి చర్మంపైనే కాదు చక్కటి పింక్ పెదాల్ని మీ సొంతం చేస్తాయి. కొన్ని నిమిషాలపాటు పెదవులపై రాస్తే ఎంతో మంచిది. దోసముక్కల్ని ఇలా ఎక్కువ సార్లు రాస్తూ ఉంటే త్వరగా మీకు ఫలితం కనిపిస్తుంది.

1039
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles