చింత చిగురు ఎంతో మంచిది!


Fri,July 12, 2019 01:07 AM

వర్షాకాలం ప్రారంభంలో దొరికే చింత చిగురు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లగా ఉండే ఈ చింత చిగురులో అనేక పోషకాలుంటాయి. దీనిని కూరల్లోనూ వాడుకోవచ్చు. కషాయం చేసుకుని తాగడం వల్లనూ అనేక లాభాలు చేకూరుతాయి.
Tamarind-Tree
-చింత చిగురు చిన్నారులకు తినిపిస్తే నులిపురుగుల సమస్య తొలిగిపోతుంది. నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింతచిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. చింతచిగురు కషాయం వల్ల బాలింతలకు పాలు పడతాయి.
-చింత చిగురులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి. తద్వారా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలోనేకాక, కీళ్లనొప్పులకు ఇది మేలు చేస్తుంది.
-చింతాకు తినడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సీజన్‌లో ప్రతి రోజు ఉదయం పూట గుప్పెడు చింత చిగురును తింటే రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చు.
-చింత చిగురుతో మరిగించిన కషాయం లేదా టీలో కాస్త తేనె వేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కామెర్లకు మందులా పనిచేస్తుంది. ఈ కషాయం తాగడం వల్ల గొంతునొప్పి, గొంతులో మంట తగ్గుతుంది.
-చింత చిగురులో లభించే విటమిన్- సి నోటిపుండ్లను చిగుళ్ల వ్యాధుల్ని నివారిస్తుంది. జ్వరం, గ్యాస్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా కూరల్లోనూ చింత చిగురును వాడవచ్చు. చింత చిగురు పచ్చడి కూడా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది.

2257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles