ఆలు.. ప్రయోజనాలు


Tue,May 7, 2019 12:52 AM

potatos


- బంగాళదుంపను ఆహారంలో తీసుకుంటే శరీరంలోని రక్తనాళాలు ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉంటాయి. బంగాళ దుంపను పాలల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపను తోలుతో పాటు నిప్పులపై కాల్చి తింటే ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టి తిన్నా ఆరోగ్యానికి మంచిదే.
- రెండు మూడు బంగాళాదుంపలను ఉడకబెట్టి కాసింత పెరుగుతో కలిపి సేవిస్తే ఆరోగ్యానికి కావాల్సిన పౌష్టికాహారం లభిస్తుంది. బంగాళ దుంపను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఉబకాయం రాదు. శరీర బరువు పెరుగదు. చాలామంది బంగాళదుంపను తొక్క తీసేసి తింటుంటారు. అదే తొక్కలతో కలిపి తింటే ఆరోగ్యానికి మరింత మంచిది.
- బంగాళదుంపలు ఉడకబెట్టిన నీటిని పారబోయకుండా. ఆ నీటితో బంగాలదుంపల రసం తయారు చేసుకుంటే మంచిది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలకు కావాల్సిన బలాన్ని అందిస్తుంటాయి.
- పచ్చి బంగాళదుంపను రుబ్బుకుని దెబ్బలు తగిలి చర్మం కమిలిన చోట పూస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. శరీరంపైన కాలిన గాయాలుంటే, ఎండ కారణంగా చర్మం పొడిబారితే చర్మ సంబంధిత జబ్బులతో బాధపడే వారికి బంగాళ దుంపతో తీసిన రసాన్ని పూస్తే ఉపశమనం కలుగుతుంది.
- అధిక రక్తపోటుతో బాధపడే వారు బంగాళ దుంపలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎండకు కమిలిపోయిన చర్మం తెల్లగా మారేందుకు ప్రతి రోజు బంగాళ దుంపను రుబ్బుకుని ఆ పేస్ట్‌ను చర్మానికి పూసుకుంటే అందంగా తయారవుతుంది.

856
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles