అరుణవర్ణంతో వెలుగొందుతుంటాడు. బుద్ధి, వివేకం, జ్ఞానం ప్రసాదిస్తాడు. బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

బాల గణపతి

మధ్యాహ్నపు సూర్యుడి వర్ణం కలిగి ఉంటాడు. భక్తులకు కార్యోన్ముఖులు కాగల పట్టుదలను, దీక్షను ప్రసాదిస్తాడు.

తరుణ గణపతి

శరత్కాల చంద్రునిలా తెల్లని రూపంతో, చల్లని వెన్నెలతో ప్రకాశిస్తుంటాడు. తనను కొలిచినవారి హృదయంలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాడు.

భక్త గణపతి

కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తుంటాడు. భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. శత్రువులను ఎదిరించే శక్తినిస్తాడు.

వీర గణపతి

సాయం సంధ్యలో సూర్యుడు ఉండే రంగులో కనిపిస్తాడు. తన భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు.

శక్తి గణపతి

పున్నమి చంద్రునిలా తెల్లని వర్ణం కలిగి ఉంటాడు. మేధస్సును పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు. విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

ధ్వజ గణపతి

బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు. సకల కార్యాల్లోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు.

సిద్ధి గణపతి

ఇది సర్వోన్నతమైన గణపతి స్వరూపంగా చెబుతారు. ఈ వినాయకుడు నలుపు రంగులో ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధనధాన్యవృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి.

ఉచ్చిష్ట గణపతి

ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడీయన. విఘ్నాలను దాటిస్తాడు. ప్రమాదాలు, ఆటంకాలు ఎదురవకుండా విజయాలు ప్రసాదిస్తాడు.

విఘ్న గణపతి

ఈయన బోళా వినాయకుడు. అతి శీఘ్రంగా స్పందించి భక్త కోటిని కరుణిస్తాడు క్షిప్ర గణపతి. చాలాకాలంగా తీరని కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు.

క్షిప్ర గణపతి

విలక్షణమైన మంత్రమూర్తి, పంచముఖుడై, నాలుగు తలలు నాలుగు దిక్కులను చూస్తుండగా.. వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు. తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు.

హేరంబ గణపతి

లక్ష్మీగణపతికి రెండు తొడలపైనా శ్రీదేవి, భూదేవి కుర్చొని ఉంటారు. ఈ గణపతి భక్తులకు ధనసంపద కలిగిస్తాడు.

లక్ష్మీ గణపతి

ఈయన సమగ్రమూర్తి. ఇప్పుడు మనం చూసే రూపం మహాగణపతిదే! ఈ వినాయకుడిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

శ్రీమహాగణపతి

కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. సర్వకార్యాల్లోనూ సాఫల్యతనిస్తాడు.

విజయ గణపతి

ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా ఉంటారు. పసిబాలుడి రూపంలో… ఆనంద తాండవం చేస్తుంటాడు. ఈయన మోక్ష స్వరూపుడు కొలిచిన వారికి సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తాడు.

నృత్య గణపతి

పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు. ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు.

ఊర్ధ్వ గణపతి

ఏకాక్షర గణపతి భక్తుల చింత, శోకం, అజ్ఞానం పోగొడతాడు. ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాడు.

ఏకాక్షర గణపతి

విఘ్నాలు తొలగించి, సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్రయక్షర గణపతి.

త్రయక్షర గణపతి

ఈయన సులభ ప్రసన్నుడు. కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు.

వర గణపతి

ఈ గణపతి కీర్తి ప్రతిష్ఠలు, పదవులు, సత్కారాలు అందజేస్తాడు.

క్షిప్ర ప్రసాద గణపతి

పసుపు రంగులో దర్శనమిస్తాడు. వివాహాది శుభకార్యాలలో తొలుత హరిద్రా గణపతిని పూజిస్తారు. ఈ దైవం విఘ్న నివారకుడు.

హరిద్రా గణపతి

దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.

సృష్టి గణపతి

ఆసురీ ప్రవృత్తులను, భయాల్ని తొలగించే ఈ గణపతి ఏకదంతుడు. భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు. వ్యాసుడు భారతం చెబుతుండగా.. ఘంటం విరిగిపోతే, తన దంతాన్ని పెకలించి, దానితో రాతను కొనసాగించాడట గణపతి. అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం.

ఏకదంత గణపతి

దుష్ట శక్తులను, శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి.

ఉద్దండ గణపతి

సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడీ స్వామి.

రుణ విమోచన గణపతి

రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.

ద్విముఖ గణపతి

కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమథ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.

డుండి గణపతి

అకార, ఉకార, మకారాల స్వరూపంగా కుడి ఎడమలకు రెండు ముఖాలు. మధ్యన ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు. కరుణ, జాలితో దీనులను, నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు.

త్రిముఖ గణపతి

భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణపతి.

సింహ గణపతి

సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడతాడు.

దుర్గ గణపతి

ఈ గణపతి యోగమూర్తి. మూలాధార స్థితుడైన జప, తప, ధ్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక ఆయురారోగ్య ప్రదాత.

యోగ గణపతి

భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి ఈయన. సంతోషం, ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి.

సంకటహర గణపతి