Esha Rebba

డైరెక్ట‌ర్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ ఈషా

తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బాకి అందం ఉన్నా..  అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు.

White Lightning
White Lightning

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఈషా రెబ్బాకి స‌రైన బ్రేక్ మాత్రం ద‌క్క‌లేదు.

White Lightning

అందుకే ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌, మల‌యాళ ఇండ‌స్ట్రీల్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.

ఇక్క‌డికంటే కూడా మంచి అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ఈషా గురించి కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైర‌ల్‌గా మారింది.

White Lightning

ఆ వార్త ఏంటంటే.. త‌మిళంలో తాను న‌టించిన ఓ సినిమా డైరెక్ట‌ర్‌ను ఈషా రెబ్బా పెండ్లి చేసుకోబోతుంద‌ట‌.

ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే డైరెక్ట‌ర్‌తో స్నేహం కుద‌రింద‌ట‌.. అది కాస్త ప్రేమ‌గా మారి పెండ్లికి దారితీసింద‌ని స‌మాచారం.

White Lightning
White Lightning

అయితే ఇక్క‌డే ఇంకొక ట్విస్ట్ ఉంది.. ఆ కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కే ఇప్ప‌టికే పెళ్లయి విడాకులు తీసుకున్నాడ‌ట‌. అత‌నికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నార‌ట‌.

ఇప్పుడు కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో రెండో పెండ్లి వార్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వార్త చూసిన‌ నెటిజన్లు.. ఇంత చ‌క్క‌గా ఉండి రెండో పెండ్లి వాడిని చేసుకోవ‌డ‌మేంట‌ని కామెంట్లు కూడా చేస్తున్నారు.

మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే ఈషా రెబ్బా అధికారికంగా స్పందించాల్సిందే.