చలికాలంలో దొరికే సీతాఫలం తింటే ఎన్ని లాభాలో

సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో దొరికే సీతాఫలం తింటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

సీతాఫలంలో సోడియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి.

ఇందులోని మెగ్నీషియం గుండె కండరాలకు సాంత్వన చేకూర్చి, హృద్రోగాల నుంచి కాపాడుతుంది.

సీతాఫలంలోని విటమిన్‌ సీ, రైబోఫ్లేవిన్‌ కళ్లకు మేలు చేస్తాయి.ఇందులోని ఫ్లేవనాయిడ్లు కొన్ని రకాల కణతులు, క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి.

సీతాఫలంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, ఎసిడిటీలను నియంత్రిస్తాయి.

అధిక మోతాదులో లభించే ఐరన్‌ పీసీఓఎస్ నియంత్రణలో సాయపడుతుంది. అలసట, చికాకులు తగ్గించి సంతాన సాఫల్యతను పెంచుతుంది.

సీతాఫలంలో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పైగా కొలెస్ట్రాల్‌ శాతం సున్నా.

కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు కూడా నిశ్చింతగా సీతాఫలం తినొచ్చు.

దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. అంటే సీతాఫలం జీర్ణం అవుతున్న సమయంలోనూ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు ఉన్నట్టుండి పెరగవు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని పరిమితంగా తినొచ్చు.