Pineapple

జ‌లుబు ఉన్న‌ప్పుడు పైనాపిల్ తినొచ్చా?

Health Benefits

పైనాపిల్‌లో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్ ఉంటాయి. పుష్కలంగా ఏ, బీ, సీ పొటాషియమ్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. ప్రొటీన్స్, మినరల్స్ పోషకాలు మెండుగా ఉంటాయి.

పైనాపిల్స్‌ను రెగ్యులర్‌గా తింటే శరీరానికి కావాల్సినంత విటమిన్ సి అందుతుంది. ఇవి తినడం వల్ల గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

పైనాపిల్ తిన‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పైనాపిల్‌లో మాంగనీస్ కూడా ఎక్కువ పరిమాణంలోనే ఉంటుంది. దీనివల్ల ఎముకలకు శక్తి చేకూరుతుంది.

లేటు వయసులో మహిళల్లో వచ్చే ఎముకల వ్యాధుల నుంచి కాపాడడానికి పైనాపిల్ తోడ్పడుతుంది. ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ ద్వారా 70 శాతం మాంగనీస్ అందుతుంది.

పిల్లలు, పెద్దలు అందరూ ఈ ముక్కలు రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది.

పైనాపిల్స్‌లో ఉండే బ్రోమ్లైన్ శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

ప్రయాణించే వాళ్లకు ఎక్కువగా బ్లడ్‌క్లాట్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారు తరచూ పైనాపిల్స్‌ను స్నాక్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

పైనాపిల్స్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తాయి.

ఇందులో బీటాకెరోటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపు బాగుండడానికి ఇది ఉపయోగపడుతుంది.

పైనాపిల్ తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి వీలుంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం.

ఎప్పుడైనా జలుబు, దగ్గు వస్తే పైనాపిల్ జ్యూస్ తాగితే ఉపశమనం లభిస్తుంది.