- Malaika Arora

ఆ విషయంలో అలవాటుపడిపోయా

బాలీవుడ్‌ కపుల్‌ మలైకా అరోరా, అర్జున్‌ కపూర్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

White Lightning
White Lightning

సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో విడిపోయిన తర్వాత అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది.

White Lightning

వీరిద్దరూ కలిసి బహిరంగంగానే చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరగడంపై ఎప్పుడూ ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉన్నాయి.

తనకంటే 12 ఏండ్లు చిన్నవాడితో సహజీవనం చేయడం పట్ల మలైకా అరోరాపై సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ కూడా వస్తుంటాయి.

White Lightning

వీటిపై తాజాగా స్పందించిన మలైకా.. మనం ఏది చేసినా ప్రజలు ట్రోల్స్‌ చేస్తుంటారని పేర్కొంది.

బ్రేకప్‌ చెబితే అది బ్రేకింగ్‌ న్యూస్‌ అని.. డేటింగ్‌ చేసినా, సైలెంట్‌గా వెళ్లిపోయినా ట్రోల్స్‌ చేస్తుంటారని అసహనం వ్యక్తం చేసింది.

White Lightning
White Lightning

మగాడు తనకంటే 20, 30 ఏండ్లు చిన్నదైన మహిళతో డేటింగ్‌ చేస్తే గొప్ప ఘనకార్యం చేసినట్టు చూస్తారని పేర్కొంది.

అదే పనిని మహిళలు చేస్తే వారిని హీనంగా చూస్తారని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి హేళనలను ప్రతిరోజూ ఎదుర్కొన్నానని.. వీటికి ఇప్పుడు అలవాటు పడిపోయానని మలైకా చెప్పింది.

సమాజం ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పట్టించుకోనని మలైకా అరోరా స్పష్టం చేసింది.

అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. పెండ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది.