#Divi Vadthya

న‌న్ను చాలామంది రిజెక్ట్ చేశారు

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్4తో పాపులారిటీ సంపాదించుకుంది దివి వాద్యా.

White Lightning
White Lightning

బిగ్‌బాస్ షో కంటే ముందు మ‌హేశ్‌బాబు మ‌హ‌ర్షితో పాటు ప‌లు సినిమాల్లో న‌టించింది.

White Lightning

కానీ సినిమాల ద్వారా రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో సంపాదించింది దివి.

ఈ సీజ‌న్ ఫైన‌ల్స్‌లో దివిని చూసి ఇంప్రెస్ అయిన చిరంజీవి.. ఆమెకు తన సినిమాలో ఆఫ‌ర్ ఇస్తాన‌ని స్టేజి మీద‌నే ప్ర‌క‌టించాడు.

White Lightning

అన్న‌ట్టుగా త‌న గాడ్‌ఫాదర్ సినిమాలో దివికి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు. సినిమాను మ‌లుపు తిప్పే పాత్ర‌లో దివి క‌నిపించింది.

ఇప్పుడు గాడ్‌ఫాద‌ర్ సినిమా స‌క్సెస్ కావ‌డంతో మీడియా ముందుకొచ్చిన దివి.. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను పంచుకుంది.

White Lightning
White Lightning

బిగ్‌బాస్ షో కంటే ముందు వంద‌కుపైగా ఆడిష‌న్స్‌లో పాల్గొన్నానని.. ఎంతోమంది త‌న‌ను రిజెక్ట్ చేశార‌ని దివి గుర్తు చేసుకుంది.

వాటితో నిరుత్సాహ‌ప‌డ‌కుండా మ‌రింత ధైర్యంగా మారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాన‌ని తెలిపింది.

ఆ షో త‌ర్వాత త‌న లైఫ్ ఎంత‌గానో మారింద‌ని.. ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పింది.

చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాల‌ని చాలామంది న‌టీన‌టులు ఆశ‌ప‌డుతుంటారని తెలిపింది.

కెరీర్ ఆరంభంలోనే త‌న‌కు ఆ ఛాన్స్ రావ‌డం సంతోషంగా ఉంద‌ని దివి చెప్పుకొచ్చింది.

మెగాస్టార్ సినిమాలో న‌టించ‌డం అద్భుతంగా అనిపించింద‌ని.. అందులో త‌న రోల్ చేసి ప్రేక్ష‌కులు తిట్టుకుంటున్నార‌ని చెప్పింది.

వాళ్లు అంత‌లా తిట్టుకుంటున్నారంటే.. నా పాత్ర‌కు న్యాయం చేశాన‌నే అనుకుంటున్నా అని తెలిపింది.

గాడ్‌ఫాద‌ర్ సినిమాలో త‌న పాత్ర‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌కు చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది.