Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Rahul Gandhi | తన తండ్రి రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) ప్రాణాలకు ముప్పు ఉన్నదని, ఆ ముప్పును తప్పించడానికి ఏం చేయకపోతే త్వరలోనే తాను ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని.. అప్పట్లో తాను తన తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) కి చెప్పిన విషయాన్ని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) గుర్తుచేసుకున్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) తో కలిసి ఓ మీడియా ఛానెల్లో తన తల్లి ఆత్మకథపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ హత్య విషయాన్ని ప్రస్తావించారు.
Rahul Gandhi : తన తండ్రి రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) ప్రాణాలకు ముప్పు ఉన్నదని, ఆ ముప్పును తప్పించడానికి ఏం చేయకపోతే త్వరలోనే తాను ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని.. అప్పట్లో తాను తన తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) కి చెప్పిన విషయాన్ని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) గుర్తుచేసుకున్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) తో కలిసి ఓ మీడియా ఛానెల్లో తన తల్లి ఆత్మకథపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ హత్య విషయాన్ని ప్రస్తావించారు.
నాడు తన తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారని అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఎయిర్‌లైన్ పైలట్ అయిన రాజీవ్ గాంధీ.. ఇందిరా గాంధీ హత్య తర్వాత అనూహ్యంగా ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి భారీ భద్రతతో ఉండేవారు. దీనిపై ప్రతిపక్షాలు ఆయనను ఎగతాళి కూడా చేశాయి. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ ప్రధాని పదవిని కోల్పోయారు.
1989 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించిన వీపీ సింగ్ రాజీవ్ గాంధీ ఓటమి గురించి మాట్లాడుతూ.. కమాండోల రక్షణ వలయంలో ఉన్న రాజీవ్‌గాంధీకి ప్రజలతో సంబంధం తెగిపోయిందని విమర్శించారు. 1991లో బీహార్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో రాజీవ్‌గాంధీ కూడా రక్షణ వలయంలో ఉండటంవల్లే ప్రజలకు చేరువకాలేకపోయానని పరోక్షంగా అంగీకరించారు. 1991 మే 5న బీహార్ సభలో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. 1984లో తాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అవసరం గురించి తేలికగా మాట్లాడేవాడిని, కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తాను వ్యవస్థ చేతిలో బందీనయ్యాను అని వ్యాఖ్యానించారు.
తనకు ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని, అది ఏమాత్రం తగ్గలేదని రాజీవ్ ఆ సభలో చెప్పారు. కమెండోల రక్షణలో ఉండటం తప్ప తనకు వేరే మార్గం లేదని అన్నారు. ప్రచారంలో పాల్గొనడమా, భద్రతలో ఉండటమా.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే అని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఒక మహిళ గంధపు పూలమాల వేస్తూ నడుముకు పెట్టుకున్న బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దాడిలో రాజీవ్‌గాంధీ మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 46 ఏళ్లు.
ఆ ఆత్మాహుతి దాడితో రాహుల్‌గాంధీ భయాలు నిజమయ్యాయి. శ్రీపెరుంబుదూర్ పర్యటనకు ముందు రాహుల్‌గాంధీ తన తండ్రితో బీహార్‌కు వెళ్లాడని, ఆ పర్యటన భయంకరమైనదని సోనియాగాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ పర్యటనలో తన భర్త రాజీవ్‌గాంధీపై రాళ్ల దాడి జరిగిందని చెప్పారు. రాజీవ్, రాహుల్ ఒక ఓపెన్ జీపులో వెళ్తుండగా వారిపై కొందరు రాళ్లు రువ్వారని తెలిపారు. అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంవల్లనే ఇలా జరిగిందని అన్నారు. రాహుల్.. తన తండ్రిపై రాళ్లు విసరడాన్ని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని దగ్గరి నుంచి చూశాడు.
అందుకే ఆ పర్యటన నుంచి తిరిగి ఇంటికి రాగానే తనతో.. ‘అమ్మా.. మనం నాన్న భద్రత గురించి ఏం చేయకపోతే నేను త్వరలోనే ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుంది’ అని చెప్పాడని సోనియాగాంధీ తెలిపారు. ఆ బీహార్ పర్యటననే తనను సహనం కోల్పోయేలా చేసిన చివరి పర్యటన అని రాహుల్‌గాంధీ చెప్పారు. నాన్నను చంపాలనే ఉద్దేశంతోనే ఆయన భద్రతను తొలగించారని, ఆయన భద్రతను తొలగించడం కేవలం సాధారణంగా జరిగింది కాదని అన్నారు. ఆయన హత్యకు గురియ్యేలా వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు.
తాను మా నాన్నకు కూడా హత్యకు కుట్ర జరుగుతున్నదని చెప్పానని, మా అమ్మకు కూడా చెప్పానని రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. నానమ్మ హత్య తర్వాత అమ్మ మా నాన్న భద్రత గురించి తీవ్ర ఆందోళనకు గురయ్యారని చెప్పారు. ముళ్ల కంచెను తనిఖీ చేసేవారని, కాపలాదారులు నిద్రపోతున్నారేమోనని గమనిస్తుండేవారని అన్నారు. తన గది ఇంటి ముందు భాగంలో ఉండటంవల్ల తాను అవన్నీ గమనించానని తెలిపారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత’
RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పాలగుట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ అద్దాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

