హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నాటికి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించింది.
మరోవైపు గురువారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా ముత్తారం-మహదేవ్‌పూర్‌లో 2.65 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజీడులో 2.36 సెం.మీ, తాడ్వాయిలో 1.64 సెం.మీ, మంగపేటలో 2.36 సెం.మీ, కామరెడ్డి జిల్లా జుక్కల్‌లో 2.14 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మగ్దూంపల్లిలో 1.91 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మణుగూరులో 1.82 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ఓదేలులో 1.76 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.