TSPSC | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-3లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం.. ఇరిగేషన్ విభాగం, ఐ అండ్ కాడ్లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జత చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా కలిపిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్యం 1388కి పెరిగింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు.