Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి : బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవునిగుట్ట తండా లో ఎండిపోయిన వరి పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మూసి ( Musi ) సుందరికరణ, ఫ్యూచర్ సిటీ ( Future City ), ఫుట్ బాల్ ( Foot Ball ) సోకులకి డబ్బులు ఉంటాయి . కానీ రైతులకు ఇవ్వడానికి నిధులు లేవా? రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.రేవంత్ తెచ్చిన కరువని ఆరోపించారు. దేవాదులలో ఎన్ని గంటలు మోటార్లు నడిపారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ నీళ్లు విడిచిపెడితే చంద్రబాబు ఆ నీళ్లను వినియోగించుకున్నారని విమర్శించారు.

రైతు భరోసా పడ్డట్టు ఫేక్ మెసేజులు పంపిన రేవంత్ రెడ్డి ఫేక్ మెసేజ్, ఫేక్ మాటలకు కేరాఫ్ గా మారారని దుయ్యబట్టారు. ఫేక్ మెసేజ్ లు పంపిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ కు ప్రజలు హాలిడే ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, కరువు మండలాల ప్రకటనలో ఇష్టరాజ్యాంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కరువు మండలాల ప్రకటన చేయలేదని విమర్శించారు.
రేవంత్ పాలనకు సున్నా మార్కులు
రేవంత్ పాలనకు సున్నా మార్కులు ఇవ్వొచ్చని అన్నారు.కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వస్తే రేవంత్ వచ్చాక 12 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని వెల్లడించారు. మెదక్ జిల్లా అంటేనే సీఎం రేవంత్ కి చిన్న చూపని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగూరు ప్రాజెక్టులో తాగునీటి సమస్య ఏర్పడిందని,సంగారెడ్డి జిల్లాలో కేంద్ర సంస్థలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని, బీరు కంపెనీలకు మాత్రం దర్జాగా నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు.
నిన్నటి క్యాబినెట్లో రైతు అంశాలపై చర్చిస్తారని అనుకున్నామని,, గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ పై దృష్టి సారించి రైతులను విస్మరించారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బోర్, మోటార్ వేయిద్దామంటే ఒక ఎమ్మెల్యే దగ్గర, కలెక్టర్ దగ్గర రూపాయి నిధి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగూరును ఖాళీ చేసి ఎండబెట్టారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

