TG Rains | తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం నుంచి బుధవారం వరకు బలమైన, స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వాయువ్య, పశ్చిమ మంధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.