TG Rains | తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేటలో పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది.
Read Also :
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల్లో పోటీతత్వం రావాలి : మంత్రి పొన్నం
Nagarjuna | నాగార్జునకు హైకోర్టులో ఊరట..ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని కీలక ఉత్తర్వులు