హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 ( నమస్తే తెలంగాణ ): స్టార్టప్‌లను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమయ్యే సలహాలు, సూచనలు, ప్రోత్సాహం, నిధుల మద్దతు అందేలా టీ కన్సల్ట్ సేవలు ఉపయోగపడుతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టీ కన్సల్ట్‌తో తెలంగాణ స్టార్టప్‌లు అంతర్జాతీయ రంగంలోని అవకాశాలు సొంతం చేసుకోగలవని ధీమా వ్యక్తంచేశారు.
టీ హబ్ కార్యాలయంలో శ్రీధర్‌బాబు బుధవారం టీకన్సల్ట్ సేవలను ప్రారంభించారు. టీకన్సల్ట్ బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీకన్సల్ట్ చీఫ్ సందీప్‌కుమార్ మాక్తాల, నిర్మాత, స్టార్టప్ ఇన్వెస్టర్ దిల్ రాజు, టీ హబ్ చైర్మన్ ఎం శ్రీనివాస్‌రావు, డబ్ల్యూటీఐటీసీ ఎన్ఆర్ఐ సెక్రటరీ కిశోర్ పుల్లూరి, రావులపాటి రాజీవ్ పాల్గొన్నారు.