Rain Update | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవొచ్చని తెలిపింది.