న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు.
తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభమవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.
కాగా, సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన వయనాడ్ సీటును వదులుకొని రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతున్నారు.
Live: In service of Maa Bharati, taking Oath as Member of Parliament, New Delhi. https://t.co/ypJ2KSDVuJ
— G Kishan Reddy (@kishanreddybjp) June 24, 2024
Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw
— ANI (@ANI) June 24, 2024